IPL 2026 19వ సీజన్ ముగింపు వేడుకల్లో ఒకే ఒక్క పేరు మారుమోగిపోయింది.. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. టోర్నమెంట్లో అత్యధికంగా 776 పరుగులు సాధించి ప్రతిష్టాత్మకమైన ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. టోర్నీ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ గా నిలిచాడు. , సీజన్ మొత్తంలో అత్యధికంగా 71 సిక్సర్లు బాదిన ఆటగాడిగా, అలాగే 237.31 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ‘బెస్ట్ స్ట్రైక్ రేట్’ అవార్డును, అత్యుత్తమ యువ ఆటగాడిగా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును కూడా కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు.