IPL ఫైనల్ మ్యాచ్ స్టేడియం నుంచి మ్యాచ్ ముగించుకుని ఆటగాళ్లు హోటల్‌కు వెళ్తుండగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.బస్సులో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల క్షణాల వ్యవధిలోనే లోపల దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది వాహనం నుండి కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యామ్నాయ బస్సు అందుబాటులో లేకపోవడంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి చూడాల్సి వచ్చింది.