డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాని పొరుగున ఉన్న ఉగాండాలో ఎబోలా వైరస్ ప్రబలింది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయెసస్ ప్రస్తుతం కాంగోలో పర్యటిస్తోన్నారు. ప్రత్యేకించి ఎబోలా వ్యాప్తికి కేంద్రబిందువు అయిన తూర్పు కాంగో ఇటూరి ప్రావిన్స్ లోని బునియాకు వెళ్లారు.
అక్కడ ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు.

