ఐపీఎల్ 2026 మహా సంగ్రామం ముగింపు దశకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 2022లో అరంగేట్రంలోనే ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, ఈసారి యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో తన రెండో ట్రోఫీపై కన్నేసింది. కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ కప్‌ను ముద్దాడాలని గిల్ పట్టుదలతో ఉన్నాడు.

