భారత్‌కు మరో భారీ షాక్ తగిలింది. చాలా చిన్న దేశమైన.. తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ భారత్‌ను అధిగమించి ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరింది. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ బూమ్ సహా సెమీ కండక్టర్ల డిమాండ్ కారణంగా తైవాన్ కంపెనీల మార్కెట్ వాల్యూ భారీగా పెరుగుతూ వెళ్తోంది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్ల నుంచి తగ్గుతూ వస్తోంది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద చిప్ మేకర్ TSMC షేర్లు భారీగా రాణించడంతోనే తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.

