ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు రేపు రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలతో పాటు, ప్రధానంగా థియేటర్ల పర్సంటేజీల వ్యవహారంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాయితీలకు సంబంధించిన పలు అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.