సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ నాయకుడిని నరికి చంపారు. ఎర్కారం గ్రామ మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును గుర్తు తెలియని వ్యక్తులు మూడు ముక్కలుగా నరికి చంపారు. అనంతరం శరీర భాగాలను ఎస్ఆర్ ఎస్ పి కాలువలో పడేశారు. మధు హత్యతో ఎర్కారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు, పాత విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చింతలపాటి మధు భార్య మౌనిక గతంలో బీఆర్ఎస్ తరపున సర్పంచ్ గా పనిచేశారు.