శనివారం చమురు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పెట్రోల్ లీటరుకు 87పైసలు పెరిగింది. డీజిల్ లీటరకు 91పైసలుపెరిగింది. సీఎన్జీ ఢిల్లీలో కిలోకు రూపాయి పెరిగింది. ఇప్పుడు అక్కడ కిలో సీఎన్జీ ధర 91.09రూపాయలుగా ఉంది. గడచిన పది రోజులను గమనిస్తే ఇంధన ధరలు మొత్తంగా లీటర్‌కు దాదాపు ఐదు రూపాయలు పెరిగాయి. ఈ వరుస ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరకుల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది.