ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని ఎమ్మెల్సీ కె. నాగబాబు తెలిపారు. ఆయన ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులని,ఎదుటివారికి సహాయం చేయడమే కానీ ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు అని పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘సిరివెన్నెల స్మృతివనం’కు నాగబాబు బుధవారం (మే 20) శంకుస్థాపన చేశారు.