‘ఆ కుర్చీ మడతపెట్టి’ అనే ఒక్క నాటు మాస్ డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఓ ఊపు ఊపేసిన సోషల్ మీడియా సంచలనం ‘కుర్చీ తాత’ ఇకలేరు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్ వాసి అయిన మహ్మద్ పాషా బుధవారం కృష్ణ కాంత్ పార్కులో నడుస్తున్న సమయంలో హఠాన్మరణం చెందారు. ఎండల కారణంగా వడదెబ్బ తగిలి ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు రాత్రికి రాత్రే మీమ్స్, రీల్స్ రూపంలో ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి.