తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది. గురువారం ఏర్పడనున్న క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ టీవీకే అధినేత, సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు విజయ్ మంత్రివర్గంలో చేరబోతున్నట్లు వెల్లడించారు.