శంషాబాద్ అంతర్జాతీయ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో హైడ్రోపోనిక్ గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 8.705 కేజీల గాంజా పట్టుకున్నట్లు డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ గాంజా విలువ 3.05 కోట్లు ఉంటుందన్నారు. హైడ్రోపోనిక్ గాంజా తన లగేజీ బ్యాగేజ్ లో 24 వివిధ రకాల ప్యాకెట్లు, ఆహారపదార్థాల టిన్‌లలో ప్యాకింగ్ చేసి తీసుకురాగా డిఆర్‌ఐ ఆధికారులు పట్టుకున్నారు.