ఇటలీ ప్రధాని మెలోని ఇజ్రాయెల్ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీ సామాజిక కార్యకర్తల పట్ల ఇజ్రాయెల్ వైఖరిని ఆమె తప్పుబట్టారు. ఇజ్రాయెల్ మంత్రి ఇటామర్ ఒక వివాదాస్పద వీడియోను విడుదల చేశారు. అందులో గాజా వైపు పడవల్లో వెళ్తున్న సామాజిక కార్యకర్తలను ఇజ్రాయెల్ నౌకాదళం అదుపులోకి తీసుకుంది. వాళ్లను మోకాళ్లపై కూర్చొబెట్టి, తలలను నేలకు ఆనించి.. చేతులకు వెనుక నుంచి సంకెళ్లు వేశారు. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన ఇజ్రాయెల్ మంత్రి.. ‘వెల్కమ్ టు ఇజ్రాయెల్’ అని పేర్కొన్నారు.