దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ ఉండాలన్నది నా ధ్యేయం.అందుకు అనుగుణంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నా. అంతర్జాతీయస్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులపై అధ్యయనానికి ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాం. అక్కడ వారు తెలుసుకున్న మంచి బోధనాపద్ధతులను రాష్ట్రంలో అమలు చేస్తాం’అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రవ్యాప్తంగా డీఈవోలు, ఏపీసీలతో(అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్) మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.