రాకింగ్ స్టార్ మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా సినిమా ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ రిలీజ్ అయింది. మే 20 మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.ఈ మూవీ 1897 నుంచి 1922 మధ్య కాలంలో స్వాతంత్రోద్యమం సమయంలో జరిగిన సంఘటనలతో డేవిడ్ రెడ్డి కథను దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి సిద్ధం చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇక డేవిడ్ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.