ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు కోర్టు మరోసారి బెయిల్ నిరాకరించింది. తన తల్లిని సంరక్షించుకునేందుకు, అలాగే, మరో కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఉమర్ ఖలీద్ ఇటీవల ఢిల్లీలోని కార్కర్‌డూమా కోర్టును ఆశ్రయించాడు. ప్రతి బెయిల్ దరఖాస్తును ప్రత్యేకంగా చూస్తామని, వాస్తవాల్ని, అవసరాల్ని పరిశీలిస్తామని చెప్పింది. ఉమర్ తల్లిని చూసుకునేందుకు అతడి సోదరి, తండ్రి అందుబాటులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.