పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదు
అనే పోస్టర్లు ఇప్పుడు నిజామాబాద్‌లోనూ వెలిశాయి. భగీరథ్ పరారీలో ఉన్నాడని.. ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో, రోడ్ల పక్కన, గోడలపై కనిపించడంతో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భగీరథ్‌ను అరెస్టు అలసత్వం పై ప్రజలు మండిపడుతున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. కేంద్రమంత్రి కొడుక్కి మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.