పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఆస్తుల ధ్వంసంపై దాఖలైన పిటిషన్లపై కలకత్తా హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ కేసులో విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు బీజేపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారని, పలువురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా వేలాది మంది నిరాశ్రయులయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది.