తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెళ్లకూరు మండలం పునబాక గ్రామానికి చెందిన కోనేటి మమత (36), బుధవారం సౌదీలోని జుబేల్‌లో తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ధృవీకరించారు. తిరుపతిలోని కుటుంబ ఆస్తుల వివాదం కారణంగా గత కొంతకాలంగా మమత తీవ్ర మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం