ప్రముఖ నెట్వర్కింగ్ సంస్థ ‘సిస్కో’.. మరో విడత ఉద్యోగ కోతలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో దాదాపు 4,000 మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఇది మొత్తం సిబ్బందిలో 5 శాతం కంటే తక్కువని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి సంబంధించిన రంగాల వైపు పెట్టుబడులను మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు ఉన్నాయని సీఈవో చక్ రాబిన్స్ వివరించారు. మరోవైపు.. మూడో త్రైమాసికంలో 12 శాతం శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ వెల్లడించింది.