ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉపాధ్యాయులకు సంబంధించి రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఒకవైపు పదోన్నతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తూనే, మరోవైపు ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చేలా విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కపై ఉపాధ్యాయుల ప్రమోషన్లలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత తప్పనిసరి. స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు పొందే వారు ఖచ్చితంగా టెట్ పాస్ అయి ఉండాలి. సర్వీసులో ఎప్పుడు చేరినప్పటికీ ప్రమోషన్ కావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సిందే.