ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరం నుండి స్పెయిన్ పయనమైన ‘యాంబిషన్’ అనే క్రూయిజ్ షిప్లో విషాదం చోటుచేసుకుంది. నోరోవైరస్ లక్షణాలతో బాధపడుతూ నౌకలోని 90 ఏళ్ల వృద్ధుడు ఒకరు మరణించారు. ఈ విషయం తెలియగానే ఫ్రాన్స్ అధికారులు అప్రమత్తమై, నౌకను తమ తీరంలోనే నిలిపివేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నౌకలో ఉన్న సుమారు 1,700 మంది ప్రయాణికులు మరియు సిబ్బందిని బయటికి రాకుండా క్వారంటైన్ చేశారు.

