అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్వయంగా విమానాశ్రయానికి రాలేదు.జిన్‌పింగ్ స్థానంలో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ట్రంప్‌కు స్వాగతం పలికారు. సాధారణంగా అగ్రరాజ్య అధినేతలు వచ్చినప్పుడు దేశాధినేతలు స్వయంగా రావడం ఒక గౌరవ సూచకం. కానీ, జిన్‌పింగ్ రాకపోవడాన్ని అమెరికా పట్ల చైనా చూపుతున్న కఠిన వైఖరికి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

