కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన హామీల్లో పెండింగ్ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. కోఆపరేటివ్ శాఖ నుంచి మరింత సహకారంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. అమరావతిలో పనుల పురోగతిని వివరించి నిధుల సహకారం పెంచాలని విజ్ఞప్తి చేశారు.

