అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో వివాహం చేస్తారేమోనన్న భయంతో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మర్తాడు గ్రామానికి చెందిన రూపకీర్తన(17) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. అమ్మాయికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకున్నారు. అయితే, ఈ విషయంలో రూపకీర్తన తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వారు ఎక్కడ తనకు పెళ్లి చేసేస్తారోనని మనస్తాపానికి గురై భయంతో పురుగుల మందు తాగింది,చికిత్స పొందుతూ రూపకీర్తన మృతి చెందింది.