తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తల్లిదండ్రులు, సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వారితో పాటుగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరి కళ్లు ఆమె వైపే నిలిచాయి. త్రిష సంప్రదాయ చీరకట్టులో,నుదుటిన చిన్న బొట్టు, తల్లో పూలు పెట్టుకొని, సింపుల్ గా మేకప్ వేసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.