తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెప్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికైంది. ఆయనతో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.