జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి మాజీ మంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు వైసీపీ హయాంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని బాలినేని అన్నారు. అయితే వైఎస్ జగన్ను ప్రశ్నించినందుకే తన మంత్రి పదవి పోయిందన్నారు. తాను ప్రశ్నించే పార్టీలో ఉండాలని కోరుకున్నట్లు బాలినేని తెలిపారు. అలాగే జగన్ ను కూడా ఎక్కువగా ప్రశ్నించేవాడినని గుర్తు చేశారు. అయినా జగన్ ఎప్పుడూ తన గురించి వేదికలపై మాట్లాడలేదని అన్నారు.