కడప నగరంలోని ఆల్మాస్ పేట సర్కిల్ పేరు మార్పు వ్యవహారం శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సర్కిల్‌ను టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలని ఒక వర్గం ప్రయత్నించగా, దానిని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ వివాదంతో ఆల్మాస్ పేట ప్రాంతం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఇరువర్గాల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పోటాపోటీగా ఆందోళనలు ఆల్మాస్ పేట సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారు, దానిని హనుమాన్ సర్కిల్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.