ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) క్రమశిక్షణారాహిత్యం, డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని గొండాలో మే 10 నుంచి 12 వరకు జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలోనూ పాల్గొనలేరని స్పష్టం చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. పదవీవిరమణ నుంచి తిరిగి పోటీల్లో
పాల్గొనేందుకు ఆరు నెలల నోటీస్ వ్యవధిని పూర్తి చేయడంలో వినేశ్ విఫలమైనట్లు డబ్ల్యూఎఫ్ఎస్ఐ తెలిపింది.