పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితంగా బీజేపీ గెలిచిందని, తన పదవికి రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ భీష్మించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ తన ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్‌ను మార్చేశారు. ఓటమిని అంగీకరించిన రీతిలో ఆమె ప్రొఫైల్‌లో కనిపించింది. బయో డిటేల్స్‌ను తన ప్రొఫైల్‌లో ఆమె అప్డేట్ చేశారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలి రాశారు. దాంతో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన 15, 16, 17వ విధాన సభలకు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు ఎడిట్ చేశారు.