పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మొయినా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఈ కీలక బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వంలో మనోజ్ తివారీ క్రీడా మంత్రిగా పని చేయగా ఇప్పుడు మరో క్రికెటర్ ఆ స్థానంలోకి వచ్చారు. క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దిండా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.