బీహార్‌లో మంత్రిమండలిని విస్తరించారు. కొత్తగా ఇవాళ 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. బీహార్‌లో అయిదు పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైని మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.