పాలనలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులు పూర్తిగా ప్రక్షాళన కావాలని, భూముల విషయంలో ‘జీరో ఎర్రర్’ ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థికేతర ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని, పబ్లిక్ రిలేషన్స్‌తో పాటు పబ్లిక్ డెలివరీ కూడా ముఖ్యమని సూచించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, కార్యదర్శులు 3 రోజులు, కలెక్టర్లు 8 రోజులు ఫీల్డ్ వర్క్
చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశించారు.