భారతదేశంలో డిజిటల్ సేవల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆధార్ సేవలు కూడా మరింత సులభతరం అవుతున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆధార్ మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం మూడు నెలల్లోనే ఈ యాప్‌ను 2.1 కోట్లకు పైగా మంది డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం. ఇది డిజిటల్ ఇండియా దిశగా మరో ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ నంబర్, చిరునామా మార్పులు వంటి సేవలను ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగే సౌకర్యం అందుబాటులో ఉంది.