మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ “వారణాసి”. సన్నివేశాల కోసం ఒక్కోటి 10 వేల లీటర్ల సామర్థ్యమున్న 150 ట్యాంకర్ల నీటిని సరఫరా చేయాలని నిర్మాతలు HMWS&SBను అభ్యర్థించారు. కానీ నగరంలో ఇప్పటికే నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. భారీ స్థాయిలో నీటిని కేటాయించడం సాధ్యం కాదని వాటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. కొందరు నెటిజన్లు “ప్రజలకు తాగునీరు దొరకడం లేదు… సినిమా కోసం 150 ట్యాంకర్లా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రాజమౌళిపై నేరుగా ట్రోల్స్ చేస్తున్నారు.

