బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. భవానీపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021లోనూ మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించిన విషయం తెలిసిందే. ఇక బెంగాల్లో భాజపా 200కుపైగా సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకోగా.. టీఎంసీ ఇప్పటి వరకూ కేవలం 72 స్థానాల్లోనే విజయం సాధించింది. మరో 7 స్థానాల్లో ముందంజలో ఉంది.

