ఐదు రాష్ట్రాల ఎన్నికల క్రమంలో వైఎస్ జగన్ తన ట్వీట్ లో తమిళనాడు ఎన్నికల్లో గెలుపు జోష్ లో ఉన్న టీవీకే అధినేత విజయ్ గురించి ప్రస్తావించారు. నా ప్రియ సోదరుడు విజయ్‌కి ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు! అని తెలిపారు. మీ మొట్టమొదటి ఎన్నికలోనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడం అద్భుతం అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి.. దీదీ గారికి నా సానుభూతి అని జగన్ తెలిుపారు. అలాగే బీజేపీకి, ఇతరులకు అభినందనలు అంటూ జగన్ ట్వీట్ ముగించారు.

