ఒమన్ మస్కట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ కన్నీటి పర్యంతమై విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తాను పని కోసం మస్కట్ వెళ్లగా అక్కడ యజమాని తనను నిత్యం తీవ్రంగా వేధిస్తున్నాడని.. గదిలో బంధించి కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నాడని ‘పవనన్నా.. దయచేసి నన్ను కాపాడండి.. నన్ను చంపేస్తారన్నా’ అంటూ ఆ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కన్నీటితో వేడుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

