వైఎస్ఆర్ జిల్లా, మైలవరం మండలం, దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన, చిన్య లావణ్య (28) ఈమె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది..నిన్న మధ్యాహ్నం రోడ్డు పక్కన తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది. లావణ్య బీటెక్ పూర్తి చేసిన తర్వాత రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది.అనేక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది

