అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పీ4 (P4) పథకం కింద 35 మంది భవన నిర్మాణ కార్మికులకు ముఖ్యమంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

