ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 78.39 శాతం ఉత్తీర్ణత, గతేడాది ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం ఉత్తీర్ణత సాధించారు.

