పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బుధవారం రెండోదశ పోలింగ్ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటగంటకే 61.11 శాతం పోలింగ్ నమోదైంది. హావ్రా ఉత్తర్లో 63.16 శాతం ఓటింగ్ రికార్డయింది. బారకుర్లో 61 శాతం మందికిపైగా ఇప్పటివరకు ఓటేశారు. డైమండ్ హార్బర్, భవానీపుర్, సందేశాలి, దమ్హమ్లోనూ 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

