అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ముఖచిత్రం ఉన్న అమెరికా పాస్‌పోర్టులను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్ పాస్ పోర్టులకు సంబంధించిన ఫొటోలను కూడా అది పంచుకుంది. అందులో స్వాతంత్య్ర ప్రకటన పత్రంపై ట్రంప్ ఫొటో ఉండగా.. దాని కింద బంగారు రంగులో ఆయన సంతకం ఉంది. మరొక దానిలో యూఎస్ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటో ఉంది. ప్రస్తుతం ఇవి నెట్టింట్ తెగ వైరల్ అవుతున్నాయి

