పశ్చిమ బెంగాల్లో బుధవారం జరగనున్న రెండో దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతను మోహరించింది. అయితే, పోలింగ్ కు కొన్ని రోజుల ముందు రాష్ట్రంలో నాటుబాంబులు లభించడం, స్వల్ప పేలుడు ఘటనల నేపథ్యంలో ఈసీ అప్రమత్తమైంది. కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, ఓటింగ్‌కు అంతరాయం కలిగించేందుకు దుండగులు బాంబులను ఉపయోగించే ప్రమాదం ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు సూచించింది.

