మూడు రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్ లైన్లను పేల్చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం పై ఇరాన్ స్పందించింది. చమురు క్షేత్రాలు సహా తమ మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడితే.. అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో దానికి నాలుగు రెట్లు ఎక్కువగా విధ్వంసానికి పాల్పడతామని ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ హెచ్చరించారు. తమ లెక్కలు అందరిలా కాకుండా భిన్నంగా ఉంటాయన్నారు. శత్రువులు ఒక్క చమురు బావిపై దాడి చేస్తే.. తాము నాలుగు చమురు బావులపై దాడులు చేస్తామన్నారు.

