ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత ఏర్పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులోని పలు చోట్ల బంకుల వద్ద డీజిల్ నో స్టాక్ బోర్డులు పెట్టారు. కొన్ని చోట్ల బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. మేడికొండూరు, పేరేచర్లతోపాటు పల్నాడులోని వివిధ మండలాల్లో డీజిల్ కొరత ఉంది. కొన్ని బంకుల్లో ఆటోల్లో రూ.200, కార్లలో రూ.500 డీజిల్ మాత్రమే కొడుతున్నారు.మార్కాపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది.వివిధ బంకుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది.

