భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 133వ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో దేశాభివృద్ధి, పర్యావరణం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలను వివరిస్తూ ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. గౌతమ బుద్ధుని బోధనలు నేటి సంఘర్షణల ప్రపంచానికి అత్యంత అవసరమని ప్రధాని పేర్కొన్నారు. సౌర, పవన శక్తి వినియోగం మన భవిష్యత్తుకు కీలకమని పిలుపునిచ్చారు. తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) క్రిటికాలిటీని సాధించడం ద్వారా మన అణు శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని మోదీ ప్రశంసించారు

