ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్ గౌడ్ మృతి చెందడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రభుత్వం ఎందుకు కార్మికుల పట్ల ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. సమ్మెకు దిగి సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు.

