పశ్చిమాసియాలో కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ శాంతి చర్చలు ఫలించక, యుద్ధం మళ్లీ మొదలైతే.. మేము కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతామని.. యుద్ధ భూమిలోనే శత్రుదేశాలకు వాటి రుచి చూపిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు… ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.గత రెండు వారాలుగా మేము నిశ్శబ్దంగా లేము. యుద్ధ క్షేత్రంలో మా శక్తి సామర్థ్యాలను నిరూపించేలా కొత్త వ్యూహాలను సిద్ధం చేశాం” అని ఆయన పేర్కొన్నారు

